వికారాబాద్ : విద్యా సంస్థల్లో ప్రవేశం పొందాలన్నా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డు( Aadhaar) లేనిదే పని జరగడం లేదు. దీనికి తోడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం పథకాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడంతో కొన్ని రోజులుగా ఆధార్ సెంటర్స్ వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.
ఆధార్ నమోదు, మార్పుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున(Huge crowd )క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం తాండూరు (Thandoor)లోని ఆధార్ కేంద్రానికి జనం భారీగా తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆధార్ కేంద్రం వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆధార్ సెంటర్స్‌ను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.