హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల సం ఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కే విరాహత్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం సచివాల యంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపింది. జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిషారానికి కృషి చేయాలని కోరారు.
జర్నలిస్టు యూనియన్ల విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన ప్రతినిధి బృందంలో ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు కే రాంనారాయణ, యూనియన్ నాయకులు కే రాములు, శిగా శంకర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.