హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆఫ్రికా దేశానికి చెందిన 30 మంది జర్నలిస్టుల బృందం హైదరాబాద్ పర్యటనకు రానున్నది. వీరు నగరంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. భారతదేశంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకొనేందుకు వీరు దేశ పర్యటన చేయనున్నారు. ఇందులోభాగంగా ఆఫ్రికన్ జర్నలిస్ట్ బృందం బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నది. ఈ నెల 14, 15 తేదీల్లో వీరు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ బృందం గురువారం నగరంలోని భారత్ బయోటెక్, టీహబ్‌తోపాటు శిల్పారామాన్ని సందర్శించనున్నది. శుక్రవారం యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శించిన అనంతరం ఈ ఆఫ్రికన్ జర్నలిస్టులు 16న తిరుగు ప్రయాణం అవుతారు.