Telangana | మామిళ్లగూడెం, జూలై 16: అల్లారుముద్దుగా పెంచుకున్న పాపానికి అమ్మమ్మనే హతమార్చాడు ఓ మనుమడు. జల్సాలకు డబ్బు లు ఇవ్వలేదన్న కోపంతో మట్టుబెట్టాడు. ఈ ఘటన ఖమ్మంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన అమరబోయిన రాం బాయమ్మ (80), విశ్వనాథం దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. ఉపాధి నిమిత్తం కొడుకులు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కుమార్తెలకు వివాహాలై వారిళ్లకు వెళ్లిపోయారు.
భర్త విశ్వనాథం మరణించడంతో ఆమె ఒంటరిగా ఉంటున్నది. చిన్న కుమార్తె కొడుకు ఉయ్కుమార్ను పెంచి పెద్దచేసింది. టెన్త్ పూర్తికాగానే డిప్లొమా కోర్సులో చేరి మధ్యలోనే వదిలేశాడు. మద్యం, గంజాయికి బానిసయ్యాడు. డబ్బుకోసం తరచూ వేధించేవా డు. 3 వేలు ఇవ్వాలని సోమవారం రాత్రి ఒత్తిడి చేశాడు. తన వద్ద లేవ ని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న ఉదయ్‌కుమార్ ఆమెపై దాడి చేయగా అక్కడికక్కడే మరణించింది.
మంగళవారం ఉదయం పొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె విగతజీవిగా పడి ఉండటా న్ని గమనించి ఉదయ్‌ని ప్రశ్నించారు. జారి పడిందని నమ్మించే ప్ర యత్నం చేశాడు. అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. స్థానికులు.. చితకబాది పోలీసులకు అప్పగించారు.