Teacher Murder | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం పర్సువాడ వద్ద దారుణం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్‌ను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. జైనథ్ మండలం కెనాల్ మేడిగూడలో టీచర్‌గా గజేందర్ పని చేస్తున్నారు. మృతుడి స్వస్థలం నార్నూర్ మండలం నాగులకొండ.
సమాచారం అందుకున్న పోలీసులు ఘనటాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గజేందర్‌ను ఎందుకు హత్య చేశారనే కారణాలపై పోలీసులు దృష్టి సారించారు.