హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో(kamareddy) విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (Government teacher) పురుగుల మందు తాగి(Pesticides) బలవన్మరణానికి(Suicide) పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. వీణ అనే ఉపాధ్యాయురాలు బీబీపేట మండలం జనగామ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నది. తనకు సిద్దిపేటకు చెందిన శ్రవణ్ కుమార్తో 2015లో వివాహమైంది. అయితే కొంతకాలంగా భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మతిస్థితిమతం కోల్పోయిన వాణి పురగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.