నల్లగొండ : ఓ గీత కార్మికుడు 4 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ప్రమాదవశాత్తు ఆ కార్మికుడి తాటి చెట్టు ఎక్కిన తర్వాత మోకు జారడంతో.. తలకిందులుగా వేలాడాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు నాలుగు గంటల పాటు శ్రమించి, ప్రాణాలతో కాపాడారు.
సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన బాలగొని మాశయ్య (57) రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం తాళ్ల వనానికి వెళ్లాడు. తాటి చెట్టు ఎక్కిన తర్వాత మోకు జారడంతో.. గీత కార్మికుడు తాటి చెట్టుపైనే చిక్కుకుపోయి, తలకిందులుగా వేలాడాడు. ప్రమాద శాత్తు చెట్టుపై నుంచి జారిన మాశయ్య సుమారు నాలుగు గంటలకుపైగా అక్కడే నరకయాతన అనుభవించాడు. స్థానికులు…. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని గీత కార్మికుణ్ని క్రేన్ సహాయంతో కిందకు దించారు.