Telangana Decade Celebrations | హైదరాబాద్/కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మంచినీళ్ల పండుగను నిర్వహించనున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మిషన్ భగీరథ విజయోత్సవ సభ ను నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు హాజరు కానున్నారు.
జిల్లా, నియోజవర్గ కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సందర్శిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో భయంకరమైన తాగునీటి ఇబ్బందులను ప్రస్తావిస్తూ, మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్యను సంపూర్ణంగా పరిషరించిన విధానాన్ని తెలియజేస్తారు. తాగునీటి కష్టాలు సంపూర్ణంగా తీరిపోయి, మహిళలు సంతోషిస్తున్న విధానాన్ని తెలియజేస్తారు.