ఆదిలాబాద్, జూన్ 13 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బీజేపీ నాయకుల మధ్య ఘర్ష ణ చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారుడు పాయల్ శరత్ (బన్నీ), బీజేపీ పట్టణ అధ్యక్షుడు గండ్ర త్ మహేందర్ మధ్య గొడవ జరిగింది.
ఈ ఘర్షణలో మహేందర్‌కు గాయాలయ్యాయి. బాధితుడు మహేందర్ సోషల్ మీడియాలో పా యల్ శరత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేగా గెలిచిన 18 నెలల్లో మీ అహంకారం బయటపడిందని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. దాడికి పాల్పడిన వారిపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మహేందర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.