RTC bus | ప్రయాణికురాలు, కండక్టర్‌కు మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
RTC bus | ఆర్టీసీ బస్సులో(RTC bus) ఓ ప్రయాణికురాలికి(Female passenger), కండక్టర్‌కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం జరిగింది.
చొప్పదండి, జూన్12: ఆర్టీసీ బస్సులో(RTC bus) ఓ ప్రయాణికురాలికి(Female passenger), కండక్టర్‌కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు(Karimnagar) వస్తున్న బస్సు మహిళలతో కిక్కిరిసిపోయింది. మార్గమధ్యంలో చొప్పదండి బస్‌స్టేషన్‌లో బస్సు ఆపగా, మరికొందరు మహిళలు బస్సు ఎక్కారు. అయితే బస్సు మెట్లపై ఎవరూ ఉండొద్దని, లోపలికి రావాలని కండక్టర్(Conductor) పిలువగా, అందులోని ఓ ప్రయాణికులు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో డ్రైవర్ బస్సును ఆపగా, గొడవ చినికిచినికి గాలివానలా తయారై చొప్పదండి ఠాణా వరకు చేరింది. పోలీస్ సిబ్బంది వారితో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ఫ్రీ బస్సు స్కీంతో అసలు సీట్లే లేకుండా పోయాయని, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ప్రయాణికులు మండిపడ్డారు. బస్సులు సరైన సమయానికి రావడం లేదని, వచ్చినా కిక్కిరిసి పోవాల్సి వస్తున్నదని, వెంటనే అదనపు నడిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

