మహబూబ్నగర్ : ఆ తండ్రి తన కూతరును అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. విద్యాబుద్ధులు నేర్పించి యుక్త వయసురాగానే సంప్రదాయబద్ధంగా ఘనంగా పెండ్లి జరిపించాడు. అత్తారింట్లో సంతోషంగా ఉంటుందని నమ్మని ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి. వరకట్నం వేధింపులతో (Dowry harassement) తన కూతురు బలవన్మరణానికి(daughter dies )పాల్పడిందని భావించిన తండ్రి వినూత్న రీతిలో నిరసన (Father protest) చేపట్టాడు.
కూతురు మృతికి కారణమైన భర్త, అత్త, ఆడపడుచు కనిపిస్తే నాకు సమాచారమివ్వండి అంటూ జాతీయ రహదారిపై(National Highway) బాధితురాలి తండ్రి వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ(Flexi) ఏర్పాటు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..కర్ణాటకలోని సేడం తాలూకా శంకర్పల్లికి చెందిన చెన్నప్పగౌడ తన కూతురు జయలక్ష్మిని నారాయణపేట(Narayanapet) జిల్లా కృష్ణ మండలం గుదేబల్లూర్ గ్రామానికి చెందిన శంకర్ రెడ్డితో 3ఏళ్ల క్రితం పెళ్లి చేశారు.
కాగా, వరకట్న వేధింపులతో ఏడాది క్రితం జయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. ఆవేదనకు గురైన ఆ తండ్రి ‘నా కూతురు మృతికి కారణమైన భర్త, అత్త, ఆడపడుచులు అదృశ్యమయ్యారు. కనిపిస్తే నాకు సమాచారమివ్వండి’ అని జాతీయ రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది.