పాలమూరు : జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో 20 మంది ఉద్యోగస్థులు ( Employees ) క్షేమంగా (Employees Safe ) బయటపడ్డారు. మహబూబ్నగర్ ( Mahabubnagar ) జిల్లా దివిటిపల్లి జాతీయ రహదారిపై జరిగిన వివరాలు ఇలా ఉన్నాయి . జాతీయ రహదారి ( National Highway ) నుంచి ఐటీ ఆఫీసు ( IT office ) వెళ్లే మార్గంలో తెల్లవారుజామున నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి దివిటిపల్లి చెరువు అలుగు పారింది. ఒక్కసారిగా నీళ్లు రోడ్డు పైకి వచ్చాయి.
ఉదయం అమర్రాజ బ్యాటరి కంపెనీ బస్ ( Company Bus ) ఆ మార్గంలో వెళుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగి బస్సు ముందరి భాగం నీళ్లలో పడింది. ఆ సమయంలో దాదాపు 20 మంది ఉద్యోగస్థులుండగా ఎమర్జెన్సీ డోర్ ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. కొందరికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గురువారం మధ్యాహ్నం క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు.