Rythu Bandhu | కొల్లాపూర్, ఫిబ్రవరి 08 : సీఎం ఇలాకలో టకీటకీ మని రైతు భరోసా డబ్బులు పడతాయని ఎదురు చూసి సహనం కోల్పోయిన బాధిత రైతు జాతీయ రహదారి 167కే పై బారికేడ్ పెట్టి నిరసన తెలిపేందుకు యత్నించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
ముష్టిపల్లి గ్రామానికి చెందిన బండమీది జగపతికి ఎకరాన్నర భూమి ఉంది. జగపతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణకు వ్యవసాయం తప్ప మరో ఆధారం లేదు. వానకాలం పంటకు రావాల్సిన రైతుబంధు రాకపోవడంతో.. దళారుల వద్ద అప్పు తెచ్చి పంటలు సాగు చేశాడు. యాసంగి పంటకు సైతం పెట్టుబడి సాయం కోసం దళారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన అప్పు పుట్టలేదు. దీంతో సీఎం చెప్పిన టకి టకీ మని మాట గుర్తుకొచ్చి బాధిత రైతు పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని గ్రామీణ వికాస బ్యాంకులో రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చూద్దామని బ్యాంక్ వద్దకు వెళ్లాడు. రైతు భరోసా డబ్బులు లేవు గిరోస డబ్బులు లేవని అధికారులు చెప్పడంతో మనోవేదనకు గురయ్యాడు. ఎకరాకు 6000 వేస్తామన్న రేవంత్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వేయకుండా మోసం చేసిందని ఆగ్రహంతో జాతీయ రహదారిపైకి వచ్చి బారికేడ్ పెట్టి నిరసన తెలిపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆర్టీసీ సిబ్బంది బాధిత రైతును నెట్టి వేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులకు డబ్బులు వేయకుండా రైతుల ఉసురు తీస్తున్న ప్రభుత్వంపై బాధిత రైతు శాపనార్థాలు పెట్టాడు.
రైతు బంధు రాట్లేదని రోడ్డు మీద బ్యారికెడ్స్ పెట్టి బస్సును ఆపిన రైతు
కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు మంచిగా వచ్చేది రేవంత్ వచ్చాక సర్వ నాశనం అయ్యిందని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఒక రైతు బస్సులను నిలిపివేస్తూ రైతుబంధు డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు pic.twitter.com/8JNuGEFHLZ
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2025
ఇవి కూడా చదవండి..
Woman | వారి దృష్టంతా ఒంటరి మహిళలపైనే.. ఎందుకంటే..?
Local body Elections | స్థానిక ఎన్నికలపై యువత దృష్టి.. గ్రామాల్లో ప్రశ్నించే గొంతుగా యువత..!
Ration Cards | రేషన్ కార్డు దరఖాస్తు రాత్రి ఓపెన్.. తెల్లారి బంద్.. కాంగ్రెస్ సర్కార్‌పై సెటైర్లు