వికారాబాద్ : వికారాబాద్(Vikarabad )జిల్లా మోమిన్‌పేట్‌లో భారీ వర్షం(Heavy rains) కురిసింది. వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, మేకవనం పల్లి గ్రామం నుంచి అమ్రదికుర్దు వెళ్లే దారిలో ఉధృతంగా ప్రవహిస్తున్న బండ్ల వాగులో పడి ఓ రైతు గల్లంతయ్యాడు.
వాగు దాటే సమయంలో బైక్‌తో సహా మొహతాజ్ అలీ అనే రైతు కొట్టుకుపోయాడు. స్థానికులు వాగులో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం మృతదేహం(Farmer died) లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు ఆమ్రదికాలన్ గ్రామానికి చెందిన మొహతాజ్ అలీగా గుర్తించారు.