ములుగు : మేడారంలో(Medaram) అధికారుల నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు తెచ్చింది. హరిత వై-జంక్షన్ దగ్గర లైటింగ్ నేమ్ బోర్డు(Lighting name board)కిందపడటంతో ఎడ్ల నర్సయ్య అనే భక్తుడికి గాయాల య్యాయి. నేను ప్రమాదంలో చిక్కుకున్న పోలీసులు, అధికారులు మానవమాత్రంగానైనా సాయం చేయలేదని క్షతగాత్రుడు వాపోయాడు. బోర్డు కుప్పకూలడానికి పోలీసులే కారణం. లైటింగ్ నేమ్ బోర్డులో ఇరుకున్న నన్ను పోలీసులు కాపాడలేదు.
నా భార్య బ్రతిమలాడిన అక్కడ ఉన్న పోలీసులు కనికరించలేదన్నారు. బయట వ్యక్తులు 20 మంది వచ్చి నన్ను బయటకి తీసారు. లైటింగ్ బోర్డులు ప్రభుత్వానివా? ప్రైవేట్ వా? ప్రైవేట్ అయితే రక్షణ చర్యలేవి? భక్తుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది? పోలీసులున్నది భక్తుల కోసం కాదా అని నర్సయ్య ప్రశ్నించారు.
కాగా, ఈ విషయం బయటకు పోకుండా ఉంచేందుకు అధికార యంత్రాంగం తంటాలు పడుతున్నది. సంఘటన వీడియోలు తీయవద్దంటూ కాంట్రాక్టర్లు
మీడియాను అభ్యర్థించారు. జాతర నిర్లక్ష్యాన్ని గోప్యంగా ఉంచేందుకు మంత్రాంగం నడుపుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోర్గిండ్ కూలే సమయంలో భక్తులు ఎక్కువ మంది లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వం సరైన చర్యలు కల్పించి మొక్కులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.