యాదాద్రి భువనగిరి : ఆస్తి పంపకాల్లో చెప్పినమాట వినలేదని గ్రామ బహిష్కరణ(Village boycott) చేయడంతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి(Suicide attempted )పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి (Yadadri bhuvanagiri)రామన్నపేట్ మండలం మునిపంపుల గ్రామంలో చోటు చేసుకుంది. వివారల్లోకి వెళ్తే.. ఆస్తి పంపకాల్లో గ్రామపెద్దలు చెప్పినట్లు వినకపోవడంతో రమేష్, వసంత దంపతులను గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన బాధితులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్కు తరలించారు. కాగా, ఇటీవల తాటిచెట్ల పంపకాల్లో కూడా గ్రామ బహిష్కరణ పేరుతో అన్యాయం చేశారని రమేష్ వాపోయాడు. అందువల్లో చనిపోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆస్తి పంపకాల్లో చెప్పినమాట వినలేదని గ్రామ బహిష్కరణ.. దంపతుల ఆత్మహత్యాయత్నం
యాదాద్రి జిల్లా రామన్నపేట్ మండలం మునిపంపుల గ్రామంలో ఆస్తి పంపకాల్లో గ్రామపెద్దలు చెప్పినట్లు వినకపోవడంతో రమేష్, వసంత దంపతులను గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ చేశారని ఆత్మహత్యాయత్నం చేశారు.
ఇటీవల తాటిచెట్ల… pic.twitter.com/9Sgz0znk0s
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2024