సిరిసిల్ల టౌన్, జనవరి 21: రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన కొత్వాల సాయిరాం 25 ఏండ్ల నుంచి నాణేలు, స్టాంపులు, అరుదైన వస్తువులు సేకరిస్తున్నారు. గతేడాది శ్రీరాముడి చిత్రంతో కూడిన నాణేన్ని సేకరించారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని తనవద్ద ఉన్న రాముడి బొమ్మతో కూడిన రాగి నాణేలను ఆదివారం మీడియా ముందు ప్రదర్శించారు. భవిష్యత్ తరాలకు శ్రీరాముడి చరిత్రను తెలిపేందుకు తనవద్ద ఉన్న రాగినాణేలతో ప్రదర్శన ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు.