కమాన్పూర్, సెప్టెంబర్ 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన బొమ్మేడి రవి (55) అనే బట్టల వ్యాపారి బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రవికి కమాన్ పూర్ మండల కేంద్రంలో బట్టల దుకాణం ఉంది. కాగా, వ్యాపార అవసరాల కోసం రూ.40 లక్షలు అప్పులు చేశాడు.
రవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయలో ఇంటి ఆవరణలోని చేద బావి దూలానికి చున్నీతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ, అనారోగ్యం కారణంగానే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని, తమకు ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని కుమారుడు అభినయ్ పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిపిర్యాదు మేరకు కమాన్ పూర్ ఎస్ఐ బేతి రాములు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.