వినాయక్‌నగర్, ఆగస్టు 22: ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి గల్లంతైన చిన్నారి మృతి చెందింది. ఇంటికి సమీపంలోనే మురుగు నీటిలో మృతదేహం లభించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నంద్‌నగర్‌లో నివాసముండే బాలిక అను (2) బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ మురుగు కాలువలో పడి గల్లంతయింది.
ఆనంద్‌నగర్ కాలనీ నుంచి కాలువలో గాలిస్తూ వెళ్లగా.. న్యాల్కల్ రోడ్డులోని పీఎఫ్ కార్యాలయం సమీపంలో చెత్తలో పాప మృతదేహం కనిపించింది. అప్పటిదాకా ముద్దులొలికే మాటలతో గడిపిన అను.. విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు పూజ, మారుతి గుండెలు బాదుకున్నారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.