నిర్మల్ : నిర్మల్(Nirmal) జిల్లాలో 20 రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో(Stray dogs) గాయపడిన శాన్వి తనువు చాలించింది. బిడ్డ బాగానే ఉందని అనుకుంటున్న సమయంలోనే చిన్నారి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాటిగూడ గ్రామానికి చెందిన భూక్యా అమర్‌సింగ్-సరిత దంపతులకు కొడుకు (6), కూతురు శాన్వి (4) ఉన్నారు.
ఈ నెల 2న శాన్వి ఇంటి ఎదుట ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కాగా, వెంటనే నిర్మల్‌కు తరలించి, వైద్యం చేయించారు. ఆరోగ్యం కుదుట పడడంతో రెండు రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. కాగా, శుక్రవారం ఉదయం మరోసారి పరిస్థితి విషమించడంతో నిర్మల్‌కు తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది.