కామేపల్లి, ఆగస్టు 25: కారులో ఊపిరి ఆడక ఓ బాలుడు మృతిచెందిన ఘటన ఖ మ్మం జిల్లా కామేపల్లి మండలం రుక్కితండాలో జరిగింది. రుక్కితండాకు చెందిన బానోతు అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పార్థునాయక్(4), చిన్నకొడుకు వర్షిత్. దంపతులు రోజులాగే కుమారులను శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో విడిచి వెళ్లారు. మధ్యాహ్నం దాటిన తర్వాత అంగన్వాడీ ఆయా పార్థునాయక్, వర్షిత్‌ను అశోక్ సోదరికి అప్పగించి వెళ్లింది. కొద్దిసేపటికి వర్షిత్ ఇంట్లో నిద్రపోయాడు. పార్థునాయక్ ఆడుకుంటూ బయటకు వెళ్లి ఇంటి ఎదుట పార్క్‌చేసి ఉంచిన కారు డోర్ తీసుకొని లోపలికి వెళ్లాడు.
డోర్ లాక్ కావడంతో బాలుడు లోపలే ఉండిపోయాడు. ఊపిరి ఆడక అచేతనంగా కారులోనే పడిఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అశోక్ సోదరి పార్థునాయక్ కోసం వెతికింది. కారులో పార్థునాయక్ ఉన్నట్టు గుర్తించి, గ్రామస్థుల సాయం తో కారు అద్దాలు ధ్వంసం చేసి, బాలుడిని స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.