మాక్లూర్, జనవరి 8: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లడి గ్రామంలో విషాదం నెలకొన్నది. కల్లడికి చెందిన బండా రి మధు- రజని దంపతుల పెద్ద కొడుకు హర్షవర్ధన్ తన తాత ధర్మయ్యతో కలిసి డిసెంబర్ 25న పొలానికి వెళ్లి ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేశాయి. హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స చేయించారు. 3 రోజులుగా జ్వరంతోపాటు వాంతులవడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మరణించాడు.