రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల(Rajanna cirisilla) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని కోళ్ల వ్యాను(Chicken van) ఢీకొనడంతో మృతి(Child died) చెందాడు. ఈ విషాదకర సంఘటన వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సూర రాధ, రాజేశం కొడుకు సూర హర్ష వర్ధన్ (6) షాపుకు వెళ్లి ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో వేములవాడ నుంచి చందుర్తి వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ హర్షవర్ధన్‌ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానకులు వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.