గంగాధర, సెప్టెంబర్ 10: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని పవర్‌లూమ్స్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లా విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్ ఏడీ అనిత ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన చేనేత జౌళి శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించా రు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ పవర్ లూమ్స్‌ను పరిశీలించారు.
పవర్ లూమ్స్‌పై కలర్ చీరలు నేయడానికి అనుమతి లేదంటూ గ్రామంలోని మిట్టపెల్లి వెంకటేశం అనే కార్మికుడిపై కేసు నమోదు చేశారు. దూస వెంకటేశం అనే కార్మికుడి సాంచాపై నడుస్తున్న చీరలను తొలగించారు. అధికారులు రావడంతో కార్మికులు పనులు నిలిపివేసి లూమ్స్‌కు తాళాలు వేశారు. అయినా కిటికీల్లో నుంచి తొంగి చూస్తూ కలర్ చీరలు నేసే సాంచాలను గుర్తించి కేసులు నమోదు చేశారని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు.