Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొత్త కొత్త ట్విస్ట్‌లతో, చిత్రవిచిత్ర సన్నివేశాలతో ముందుకు సాగుతోంది. సెలబ్రిటీలు – సామాన్యుల మధ్య స్నేహాలు, గొడవలు, నవ్వులు, ఎమోషన్స్ కలగలిపి హౌస్‌నే ఉగాది పచ్చడిలా మార్చేశారు.ఈసారి బిగ్ బాస్ ఓ ప్రత్యేకమైన రూల్ పెట్టాడు. సెలబ్రిటీలకు మాత్రం రోజూ అన్నం, సాంబార్, ఆలుగడ్డ కూర మాత్రమే పంపిస్తారు. అదే తినాలి తప్ప వేరే ఆప్షన్ లేదని కండిషన్ పెట్టడంతో వారు విసిగిపోయారు. మరోవైపు సామాన్యులకి అలాంటి కట్టుబాట్లు లేకపోవడంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సెలబ్రిటీ కంటెస్టెంట్ సంజన ఒక్క కప్పు టీ కోసం బ్రతిమాలుకోవడం మొదలెట్టింది. “రోజుకు ఆరు టీలు తాగుతాను, ఒక్క టీ అయిన ఇవ్వండి” అని కామనర్స్‌ను వేడుకుంది. అయితే వారు ఏమాత్రం కరగలేదు.
ఫుడ్ సరిపోకపోవడంతో, చివరికి సంజన ఒక గుడ్డును దొంగచాటుగా తినేసింది. ఆ విషయం బయటపడగానే హౌస్‌లో పెద్ద కలకలం రేగింది. కామనర్స్ ఆగ్రహంతో “గుడ్డు ఎవరు దొంగిలించారు?” అని ప్రశ్నించగా, సెలబ్రిటీలు ఎవ్వరూ నోరు విప్పలేదు. దీంతో కామనర్స్ గట్టిగా హెచ్చరించి, ఇకపై టెనెంట్స్‌కి హౌస్‌లోకి ఎంట్రీ ఉండదని చెప్పారు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. భరణి సంజనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “నీ వల్ల మిగతావాళ్లందరికీ పర్మిషన్ పోయింది” అంటూ వాదన మొదలెట్టాడు. ఆ మధ్యలో మాస్క్ మ్యాన్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో, గొడవ “భరణి vs మాస్క్ మ్యాన్”గా మారింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. కూల్‌గా కనిపించే భరణి ఈసారి తన విశ్వరూపం చూపించాడు. చివరికి సర్దుకున్నారు కానీ గుడ్డు వివాదం మాత్రం హౌస్ మొత్తాన్ని కుదిపేసింది.
ఇక సంజనకు 5 నెలల బేబీ ఉందని, ప్రోటీన్ అవసరం అని కొందరు చర్చ మొదలెట్టారు. దీనిపై సంజన కన్నీళ్లు పెట్టుకుని, “నా పర్సనల్ విషయాలు తీసుకురాకండి” అంటూ ఎమోషనల్ అయింది. మరోవైపు కామనర్స్ మధ్య కూడా చిన్న చిన్న గొడవలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. రాము రాథోడ్ ఇన్నోసెంట్ ఫేస్‌తో సేఫ్ గేమ్ ఆడుతున్నాడని మనీష్ ఘాటు వ్యాఖ్య చేశాడు. పవన్ కళ్యాణ్‌ను ఇంప్రెస్ చేయడానికి రీతూ వర్మ పులిహోర కలుపుతుంటే, ఇమ్మాన్యూయోల్ తన హడావిడి కొనసాగిస్తున్నాడు. హరీష్ ఇచ్చిన షాక్‌తో తనూజ కన్నీళ్లు ఆపలేకపోతోంది. రీతూ వర్మ మాత్రం కారణం లేకుండా అందరిపై అరిచేయడం ఆడియన్స్‌కి కూడా షాకింగ్‌గా అనిపించింది. గుడ్డు గొడవలో భరణీని అటాక్ చేయడం తోపాటు, సంజనకు సపోర్ట్ ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించింది. ఇక సుమన్ శెట్టి మాత్రం కూల్‌గా నిశ్శబ్దంగా అన్ని సన్నివేశాలు గమనిస్తున్నాడు. మొత్తం మీద గుడ్డు గొడవతో బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది. స్టార్టింగ్‌లోనే ఇలా ఉంటే, రాబోయే టాస్కుల్లో ఇంకెంత రచ్చ ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.