Road accident | నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నగరానికి చెందిన కొత్త దంపతులు సహా ఐదుగురు దుర్మరణం
Road accident | ఈ (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Road accident : ఈ (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఇటీవల విహామైన నూతన దంపతులు బాలకిరణ్, కావ్య.. కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ప్రమాదంలో బాలకిరణ్, కావ్యతోపాటు బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్, మరో బాలుడు మృతి చెందారు. కాగా, ఫిబ్రవరి 29న తెనాలిలో బాలకిరణ్, కావ్యల వివాహం జరిగింది. ఈనెల 3న తెలంగాణలోని శామీర్‌పేటలో రిసెప్షన్ నిర్వహించారు. ఇంతలో వధూవరులిద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల దుర్మరణం!
నంద్యాల – ఫిబ్రవరి 29 పెళ్లి జరిగి రెండు రోజుల క్రితం షామీర్ పేటలో రిసెప్షన్ కాగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.
ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య,… pic.twitter.com/8JrHkDkcbs
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

