మాగనూర్ : నారాయణపేట జిల్లాలోని సంగంబండ రిజర్వాయర్ రైట్ హైలెవల్ కెనాల్‌కు గండిపడింది. మాగనూరు మండలంలోని నేరడగం శివారులో సోమవారం గండి పడటంతో సాగునీరంతా వృ థాగా పోతున్నది. రిజర్వాయర్ నుంచి రైట్ హై లెవెల్ కెనాల్‌కు ఎక్కువ మొ త్తంలో నీరు వదలడంతో నేరడగం, నేరడగం దొడ్డి మధ్యలో గండి పడింది.
30 ఎకరాల వరకు పంటలకు నష్టం వాటిల్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ కాలువకు మరమ్మతులు చేయకపోవడం.. కాలువ పూడిక తీయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. కాలువ గండ్లను పూడ్చాలని రైతులు కోరారు.