హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఖాజాగూడ లేక్ రోడ్ హైటెక్ హైదరాబాద్‌ను తలపిస్తున్నదని పేర్కొంటూ అందుకు కృషిచేసిన మంత్రి కేటీఆర్‌కు తనీశ్ అనే బాలుడు ధన్యావాదాలు తెలిపారు. “హైటెక్ హైదరాబాద్‌ను తలపించేలా అందమైన ఖాజాగూడ లేక్ రోడ్‌ను అభివృద్ధి చేసిన కేటీఆర్ అంకుల్‌కు థ్యాంక్యూ.. వారాంతపు సాయంత్రాల్లో ఈ రోడ్డుపై వాహనాలు రాకుండా చేస్తే పిల్లలు స్వేచ్ఛగా నడవొచ్చు” అని తనీశ్ ట్వీట్ చేశాడు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “హే తనీశ్… నీ మంచి మాటలకు ధన్యవాదాలు.
మేము ఈ రోడ్డును, పక్కనే ఉన్న సరస్సును కుటుంబాలు, పిల్లల కోసం అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్ దీనిపై పనిచేస్తున్నది. వారాంతాల్లో ప్రత్యేకమైన ఈవెంట్స్ కోసం మేం ఏదైనా చేయగలమని ఆశిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.