మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:58:17

సిగ్నల్‌ లైట్‌ మింగిన బాలుడు

సిగ్నల్‌ లైట్‌ మింగిన బాలుడు

  • ప్రత్యేక చికిత్సతో తొలగించిన వైద్యులు

కొండాపూర్‌, జనవరి 5: ప్రమాదవశాత్తు ఓ బాలుడు టీవీ రిమోట్‌లో ఉండే సిగ్నల్‌ లైట్‌ (ఐఆర్‌ రిసీవర్‌) మింగేశాడు. ఆపై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అసలు విషయం బయటపడటంతో వైద్య చికిత్స ద్వారా లైట్‌ను తొలగించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దేవి, గోవిందుల కుమారుడు తొమ్మిదేండ్ల ప్రకాశ్‌ ఉన్నట్టుండి దగ్గుతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. తల్లిదండ్రులు దవాఖానకు తీసుకెళ్లి.. చెస్ట్‌ సీటీ స్కాన్‌ తీయించారు. ప్రకాశ్‌ శ్వాసనాళంలో చిన్న లైట్‌తోపాటు రెండున్నర అంగుళాల (ఫారిన్‌ బాడీ) తీగలు ఉన్నట్టు గుర్తించారు. రీజిడ్‌ బ్రాంకోస్కోపి అనే ప్రత్యేక చికిత్స ద్వారా శ్వాసనాళాలకు ఇబ్బందిరాకుండా సిగ్నల్‌ లైట్‌ను పూర్తిగా తొలగించారు హైదరాబాద్‌లోని మెడికవర్‌ దవాఖాన వైద్యులు. అన్ని జాగ్రత్తలు తీసుకొని సిగ్నల్‌ లైట్‌ను తొలగించామని డాక్టర్‌ రఘుకాంత్‌ తెలిపారు. బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. తెలియకుండా పిల్లలు ఏవైనా వస్తువులను మింగితే సొంత వైద్యం అందించే ప్రయత్నం చేయొద్దని సూచించారు. దగ్గరలోని వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.logo