హైదరాబాద్, సెప్టెంబర్ (నమస్తే తెలంగాణ): పోలీసు అకాడమీలో 12 నెలలపాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 547 మంది ఎస్సై అభ్యర్థులకు 9న పాసింగ్ ఔట్ పరేడ్‌ను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతున్నారు. 2022 ఏప్రిల్‌లో 17,516 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వాటిల్లో 16,929 కానిస్టేబుల్, తత్సమాన పోస్టులు, 587 ఎస్సై, తత్సమాన పోస్టులు ఉన్నాయి.
గతేడాది ఆగస్టులోనే తుది ఫలితాలు ఇచ్చారు. అనంతరం ఆలస్యం చేయకుండా గతేడాది సెప్టెంబర్‌లో శిక్షణకు ఆహ్వానించగా.. 547 మంది ఈ ఏడాది సెప్టెంబర్‌లో శిక్షణ ముగించుకున్నారు. వీరిలో వివిధ విభాగాలకు చెందిన మహిళా ట్రైనీ ఎస్సైలు 147 మంది ఉన్నారు.