హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్కు 4.95లక్షల మంది విద్యార్థులు(99.67 శాతం) హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కొందరు ఆకతాయిలు నకిలీ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి పేపర్ లీకైనట్టు పుకార్లు సృష్టించారని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.