హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ఫలితాల్లో ఎస్సీ, బీసీ గురుకులాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎస్సీ గురుకులాల నుంచి 16,845 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 16,693 మంది విద్యార్థులు (99.1%) ఉత్తీర్ణత సాధించారు. ఇస్లావత్ తిరుపతి (590), మంజుల (583), లహరి (583), వినయ్‌కుమార్(581), దుర్గం శివమణి(581), ప్రవీణ(580) మార్కులు సాధించారు.
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయఢంకా మోగించారు. బీసీ గురుకులాల నుంచి ఈ ఏడాది 19,245మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 19,047 మంది(98.99%) ఉత్తీర్ణులయ్యారు. 60 మంది విద్యార్థులు 580 కంటే ఎకువ మారులు సాధించగా, 570 కంటే ఎకువ మారులు 364మంది విద్యార్థులు సాధించారు.