సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్యెల్యే కూనంనేని
ఘనంగా ఇప్టా 90 వసంతాల వేడుకలు
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రజల సాంసృతిక మేలొలుపులో ఇండియన్ ప్యూపిల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) మూలాలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇప్టా 90 వసంతాల వే డుకలు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఎమ్మె ల్యే కూనంనేని మాట్లాడుతూ సామాజిక బాధ్యత, జాతీయ సమైక్యతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నాటకం, పాటలు, నృత్య రూపకాలను రూపొందించి భారత సాంసృతిక వారసత్వాన్ని పునరుద్ధరించాలని తెలిపారు. నటుడు, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్రావు, ప్రముఖ అభ్యుదయ రచయిత కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, ప్రముఖ కవి, అభ్యుదయ రచయిత ఏటుకూరి ప్రసాద్‌ను సన్మానించా రు. కార్యక్రమంలో అరసం జాతీయ నాయకుడు ఆర్వీ రామారావు, ప్రముఖ సినీ నటు డు మాదాల రవి, నిర్మాత మద్దినేని రమేశ్, తెలుగు వర్సిటీ మాజీ వీసీ డా. ఎస్వీ సత్యనారాయణ, ఇప్టా రాష్ట్ర నాయకులు రాజేశ్వర్‌రావు, జానకీరాం పాల్గొన్నారు.