కేసముద్రం, నవంబర్ 2 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డు ధర లభించింది. గత 10 రోజులుగా రైతులు పత్తిని మార్కెట్కు తీసుకొస్తుండగా బుధవారం క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా రూ.8,151 పలికింది. కొత్త పత్తికి ఈ ఏడాది ఈ ధరే అత్యధికం. తేమ శాతం తక్కువ ఉన్న పత్తిని విక్రయానికి తీసుకొచ్చి గరిష్ఠ ధర పొందాలని మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు రైతులకు సూచించారు.