హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ పోస్టు కోసం 8 ఏండ్ల నుంచి సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న గౌలిగూడ దళిత మ హిళ ఎట్టకేలకు విజయం సాధించారు. వివరాల్లోకి వెళ్తే.. సె్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ సివిల్ పోలీస్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో తనను స్థానికేతర అభ్యర్థిగా పరిగణించి ఉద్యో గం నిరాకరించడంపై సంగీత 2017 లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమెను స్థానిక అభ్యర్థిగా పరిగణించి ఎస్సీ రిజర్వేషన్ క్యాటగిరీలో ఉద్యోగం ఇవ్వాలని గతంలో సింగిల్ జడ్జి స్పష్టం చేశారు. అనంతరం ఆ తీర్పును సవా లు చేస్తూ రాష్ట్రప్రభుత్వం, పోలీసు నియామక మండలి దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాస నం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ 4 నుంచి 7వ తరగతి వరకు రంగారెడ్డి జిల్లాలో, 8 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్లో చదువుకున్నందున స్థానిక అభ్యర్థిగా పరిగణించాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వ అప్పీలును హైకోర్టు కొట్టివేసింది.
స్పై కెమెరాల నియంత్రణకు చేపట్టిన చర్యలేమిటి?:హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 8, (నమస్తే తెలంగాణ): దుకాణాలు, హోట ళ్లు, మరుగుదొడ్లు, మహిళల వసతి గృహాల్లో రహస్య కెమెరాల ఏర్పాటును నిరోధించేందుకు చేపట్టిన చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్ర భుత్వాన్ని ఆదేశించింది. స్పై కెమెరాల విక్రయ కేంద్రాల్లో హెచ్చరికలు ఏర్పా టు చేయాలన్న సర్యులర్ను అమలు చేయాలన్న వినతిపై మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హెవెన్స్ హోం సొసైటీ అధ్యక్షురాలు జీ వరలక్ష్మి హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సోమవా రం ప్రభుత్వానికి ఈ ఆదేశాలు జారీ చేశారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.