 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రమాదవశాత్తు శరీరం కాలి గాయాలైన వారికి ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్టు ‘బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్’ (బీఎస్ఎంఎస్) తెలిపింది. పెగాసిస్టమ్ ఆధ్యర్యంలో ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు జరుగుతాయని బీఎస్ఎంఎస్ సలహాదారు నాగరాజు తెలిపారు.
ఉచిత సర్జరీ కోసం శుక్రవారం నుంచి నవంబర్ 5 వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ కోసం 7816079234 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఉచితంగా సర్జరీ చేయించేందుకు ముందుకు వచ్చిన పెగాసిస్టమ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.
 
                            