హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : బీటెక్ పూర్తయ్యాక అత్యధిక విద్యార్థులు ఎంటెక్ కోర్సు చేయాలనుకొంటారు. మరీ ముఖ్యంగా ఐఐటీ విద్యాసంస్థల్లో ఈ కోర్సు చేస్తే జీవితంలో స్థిరపడినట్టేనని భావిస్తుంటారు. అయితే, జాతీయస్థాయిలో ఎంటెక్‌లో చేరాలంటే గాడ్యుయేషన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్షను దాటాల్సిందే. ఐఐటీ కాన్పూర్.. ఇటీవలే పేపర్ల వారీగా గేట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2023 ఫిబ్రవరి 4, 5, 11, 12తేదీల్లో గేట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పట్ల ఆసక్తి లేనివారు.. సాఫ్ట్వేర్ భూమ్ క్రమంగా తగ్గుతుండటంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టిసారిస్తున్నారు. పరిశోధనారంగంలో రాణించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గేట్‌కు సన్నద్ధమయ్యే వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ ఏడాది 8.5 లక్షల మంది విద్యార్థులు గేట్ పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాలను 11కు పెంచారు. ఇదివరకు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కోదాడలోనే పరీక్ష ఉండేది.తాజాగా ఆదిలాబాద్, కొత్తగూడెం, మెదక్, నల్లగొండలోనూ పరీక్షకేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
షెడ్యూల్ ఇలా..