హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా హజ్‌యాత్రకు ఈ ఏడాది 7,790 మందిని ఎంపిక చేసినట్టు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. హజ్ యాత్రికుల ఎంపిక లాటరీని సోమవారం నిర్వహించారు. 2024 హజ్‌యాత్రకు 11,195 దరఖాస్తులు రాగా, లాటరీ ద్వారా 7,790 మందిని ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. వచ్చే మే లేదంటే జూన్‌లో యాత్ర ఉండవచ్చని, అందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని cకు సూచించింది.