హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): దోస్త్ మూడో విడతలో 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 9,630 మంది సీట్లను మార్చుకుని మూడో వి డతలో మరో కాలేజీలో సీట్లు పొం దారు. శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కళాశాల విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు మూడు విడతల్లో 1,54,246 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
సీట్లు పొందినవారు 8 నుంచి 12వరకు రిపోర్ట్చేయాలని, లేని పక్షంలో సీటును కోల్పోతారని హెచ్చరించా రు. 16 నుంచి 18 వరకు ఇంట్రా కాలేజీ ైస్లెడింగ్కు అవకాశం కల్పించామని, 3 రోజుల పాటు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని తెలిపారు. 19న ఇంట్రాకాలేజీ ైస్లెడింగ్ సీట్లను కేటాయిస్తామన్నారు. ఎప్సెట్ మొదటి విడుత కౌన్సెలింగ్ తర్వాతే మరో విడుత దోస్త్ ప్రవేశాలు నిర్వహించా లని అధికారులు నిర్ణయించారు.