గోదావరిఖని, అక్టోబర్ 21: సింగరేణి 2022-23లో సాధించిన లాభాల నుంచి 32 శాతం వాటా రూ.711 కోట్లను యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో శుక్రవారం జమచేసింది. మొదట ఈ నెల 16న చెల్లించాలని నిర్ణయించిన యాజమాన్యం.. ఎలక్షన్ కోడ్ రావడంతో సందిగ్ధంలో పడ్డది. సింగరేణి అధికారుల కమిటీ వివరణ విన్న ఎన్నికల అధికారులు సింగరేణి లాభాల వాటా విడుదలకు అనుమతించారు.
ఈ మేరకు సింగరేణి యాజమాన్యం.. లాభాల వాటాను, దసరా అడ్వాన్స్ రూ.25 వేలను కార్మికుల అకౌంట్లలో జమచేసింది. దీంతో కార్మికుల కుటుంబాలు సంతోషంలో మునిగిపోయాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. సీఎండీ శ్రీధర్‌కు ఓసీపీ-3, ఆర్జీ-2 ఈపీ ఫిట్టర్ కనకం రమణయ్య కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.