ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 4 : ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పలు గ్రామాలకు చెందిన 701 మంది కూలీలు రాస్తారోకో నిర్వహించారు. మున్సిపాలిటీ ఉపాధిహామీ కూలీల సంఘం అధ్యక్షురాలు గరిగెల పద్మ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆసిఫాబాద్, గొడవెల్లి, జనకాపూర్, హీరాపూర్, తారకరామనగర్‌కు చెందిన 460 మంది కూలీలు జాబ్ కార్డులు కలిగి ఉన్నారని, వీరందరికీ ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
స్వయం ఉపాధికి రూ.9,000 కోట్లు: భట్టి
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువత కోసం రూ.9,000 కోట్లతో స్వయం ఉపాధి పథకాలు అందించడానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సైబర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెన్స్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, హౌస్ కీపర్స్తో పాటు టీజీపీఎస్సీ ద్వారా ఆర్థికశాఖలో నూతనంగా నియామకమైన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్‌కు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడాలని ప్రణాళికలు తయారు చేసుకొని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని తెలిపారు.