హైదరాబాద్, జూలై 12 (నమస్తేతెలంగాణ): తెలంగాణలోని సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రి నుంచి దేశవ్యాప్తం గా 7 ఈఎస్ఐసీ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్రం ప్రారంభించనున్నది. ఈనెల 14న కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఈఎస్ఐసీలో కొత్త ఓపీడీ విభాగాన్ని ప్రారంభించనున్నారు.
మిగిలిన 6 ప్రా జెక్టులు.. అస్సాంలోని బెల్తోలా 200 పడకల దవాఖాన, తమిళనాడు శ్రీపెరంబుదూర్‌లో 100 పడకలు, ఏపీలోని రాజమహేంద్రవరంలో, గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో, రాజస్థాన్‌లోని కోట ఉద్యోగ్‌నగర్‌లో, భవానీ మండిలో దవాఖానను మంత్రి ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నారు.