హైదరాబాద్, జూన్8 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పారిన్సన్, వెన్నముక సంబంధిత ఖరీదైన వ్యాధులతో కలిపి అదనంగా 65 కొత్త చికిత్సలను చేర్చారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకు రూ.497.29 కోట్లు అవసరం కాగా, డిప్యూ టీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార ఈ నిధులను విడుదల చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కొత్త చికిత్సా విధానాలు, చార్జీల సవరణకు ఆర్థిక మంత్రి భట్టి ఆధ్వర్యంలో జూన్ 7న సచివాలయంలో సమావేశం జరిగింది. అదేవిధంగా యాంజియోగ్రామ్, పారిన్సన్, వెన్నుపూసకు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని ప్రతిపాదించారు. అందుకు రూ.158.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.