హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సోమవారం సచివాలయం లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతిఓజా విడుదల చేశారు. ఫస్టియర్‌లో 63.86 శాతం, సెకండియర్‌లో 43.77శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండింటింలోనూ అమ్మాయిలే సత్తాచాటారు. కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 29లోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు.