హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం చేపట్టిన బడిబాటకు మంచి స్పం దన లభిస్తున్నది. సర్కారు బడుల్లో నమోదు పెరుగుతున్నది. రోజుకు పది వేల చొప్పున విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఆరు రో జుల్లో 61,477 మంది విద్యార్థులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.
గురువారం ఒక్కరోజే 9,970 మంది సర్కారు బడుల్లో చేరారు. పూర్వప్రాథమిక తరగతుల్లో 276 మంది, ఒకటో తరగతిలో 7,660 మంది, 2 నుంచి 10వ తరగతి వరకు 2,034 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 1,041 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారు బడు ల్లో ఒకటో తరగతిలో చేరటం విశేషం.