హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఖాతాదారులు సైబర్ మోసాలబారిన పడకుండా బ్యాంకర్లు సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఖాతాదారులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ కొందరు బ్యాంకర్లు నేరస్థులతో చేతులు కలిపి అమాయకులను మో సాల్లో భాగస్వాములు చేస్తున్నారు. దొంగలతో కలసి బ్యాంకర్లు చేస్తున్న దందాపై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) కీల క విషయాలు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో బ్యాంకర్ల నెట్వర్క్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా రూ.కోట్లాది సైబర్ నేరాల్లో ‘మ్యూల్ అకౌం ట్స్’ ద్వారా జరిగిన లావాదేవీలే అత్యధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ కరెంట్ అకౌంట్స్ తెరవడంలో పలువురు బ్యాంకు సిబ్బంది సై బర్ నేరగాళ్లు, ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు క క్కుర్తి పడుతున్నట్టు ఐ4సీ అంచనా వేస్తున్నది.
సైబర్ నేరగాళ్లు లూటీ చేసిన అమౌంట్‌ను ఇం డియన్ కరెంట్ అకౌంట్స్‌కు బదిలీ చేస్తుండగా వాటి నుంచి నగదును విత్ డ్రా, విదేశీ అకౌంట్స్‌కు బదిలీ, క్రిప్టోగా మార్చుతున్నట్టు ఐ4సీ అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సైబర్ దొంగలకు తాళాలు అందించే బాధ్యతను బ్యాంకర్లే తీసుకోవడం ద్వారా.. ‘కంచే చేను మేస్తున్న’ చం దంగా ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాంకర్ల నెట్వర్క్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాల్లో 60శాతం ‘కరెంట్ అకౌంట్’ ద్వారా జరుగుతున్నాయని తెలిపారు.
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న బ్యాంకర్లకు భారీగా కమీషన్లు అందుతున్నాయని సమాచారం. ఒక్కో కరెంట్ ఖాతా తెరిచినందుకు లక్షల రూపాయలు కమీషన్ తీసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్‌నేరగాళ్లకు ఆర్థిక నష్టాల్లో ఉన్న వాళ్లను ఎంపిక చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వారిలో విద్యార్థులు, వ్యాపారులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉంటున్నారు.
వారిని బిజినెస్ పర్సన్స్‌గా చూపించి కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. పాస్‌బుక్స్, ఏటీఎం కార్డ్స్, సిమ్కార్డ్స్, ఫోన్లు ఏజెంట్ల దగ్గర, ఒక్కోసారి బాధితుల దగ్గర ఉంటాయి. అకౌంట్లోకి వచ్చే నగదులో 10-20శాతం కమీషన్ ఇస్తున్నా రు. అక్రమార్కులతో చేతు లు కలిపిన బ్యాంకర్లపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనుకాడుతున్నారు. ఈ కేసుల్లో కింగ్పిన్ల పాత్ర పై ఆరా తీస్తున్నామని చెబుతున్నా వారిని పట్టుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.