హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల కోసం ఎస్సీఆర్ అధికారులు ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కాచిగూడ-కాకినాడ టౌన్ స్టేషన్ల మధ్య 4, హైదరాబాద్-కాకినాడ స్టేషన్ల మధ్య 2 చొప్పున ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు.
మీ పనితీరు మారాలి! ; మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్పష్టీకరణ
హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాలని సీఎం రేవంత్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన తన నివాసంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే రిపోర్టులు తన వద్ద ఉన్నాయని సీఎం చెప్పినట్టు తెలిసింది. కొందరు మరింత మారాల్సి ఉన్నదని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను కలుపుకొని పనిచేయాలని సీఎం సూచించినట్టు సమాచారం.