హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ -2024 ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌత మ్ పాఠశాల పూర్వ విద్యార్థులు పలు ర్యాంకులు సాధించారు. ఓపెన్ క్యాటగిరీలో 5వ ర్యాంకు సాధించిన పుట్టి కుశాల్కుమార్, 55వ ర్యాంకు సాధించిన సతివాడ జ్యోతిరాధిత్య తమ పాఠశాల పూర్వ విద్యార్థులేనని విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. తమ విద్యార్థులు 100లోపు 3, 5, 9, 12, 17, 26, 28, 45, 55, 64, 88 వంటి 12 ర్యాంకులు సాధించినట్టు వెల్లడించారు.