హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీఆర్ పరిధిలో 55 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్లలో ఎక్కువగా ప్యాసింజర్ రైళ్లు ఉండగా.. మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో నడిచే 55 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లను ఈ నెల 21 నుంచి 24 వరకు రద్దు చేస్తున్నట్లు ఇంతకు ముందు ప్రకటించింది. తాజాగా ఈ నెల 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, కర్నూలు, విజయవాడ, గుంతకల్ మధ్య నడిచే రైళ్లతో పాటు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మధ్య నడిచే రైళ్లను రద్దు చేసింది.
Cancellation of Passenger Trains (1/3) @drmsecunderabad @drmhyb @VijayawadaSCR @drmgnt @drmned @drmgtl pic.twitter.com/3vsktvNgVf
— South Central Railway (@SCRailwayIndia) January 24, 2022