నల్లగొండ, మే 13: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 69 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. ఈనెల 10న ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
మిగిలిన 63 మందిలో 11 మంది సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దాంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.